‘ఆదర్శ కుటుంబం’లో వెంకీ మామ హిట్ సాంగ్ రీమిక్స్?


మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరోస్ లో ఒకరైన విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా ‘ఆదర్శ కుటుంబం’ కోసం అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి బజ్ ఉన్న ఈ చిత్రం దాదాపు పూర్తి కావస్తుంది.

అయితే ఈ సినిమా విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. దర్శకుడు త్రివిక్రమ్ ఓ అందమైన సందర్భం క్రియేట్ కి వెంకీ మామ కెరీర్ లో సూపర్ హిట్టయిన సాంగ్స్ లో ఒకటి రీమిక్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అదే తన కూలీ నెంబర్ 1 సినిమా నుంచి ఇళయరాజా స్వరపరిచిన చార్ట్ బస్టర్ సాంగ్ దండాలయ్యా ఉండ్రాళ్ళయ్య అట. దీనికి థమన్ రీమిక్స్ వెర్షన్ ని క్రియేట్ చేస్తున్నట్టుగా ఇప్పుడు టాక్. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తుండగా ఈ అక్టోబర్ 2న సినిమా గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది.

Exit mobile version