వెంకటేష్ నెక్స్ట్ మూవీ టైటిల్ ‘సంతోషం సగం బలం’

venkatesh
‘గోపాల గోపాల’ సినిమా తర్వాత సుమారు 7 నెలలు గాప్ తీసుకొని కెమెరాకి దూరంగా ఉన్న విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా తన తదుపరి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాకి ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు’ సినిమాల డైరెక్టర్ క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించనున్నాడు. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా ఆగష్టులో ప్రారంభం కానుంది. మొదటి రెండు సినిమాల మాదిరిగానే క్రాంతి మాధవ్ ఈ సినిమాకి కూడా సాఫ్ట్ అండ్ పాజిటివ్ టైటిల్ ని ఫైనలైజ్ చేసారు. అదే ‘సంతోషం సగం బలం’. వెంకటేష్ కెరీర్లో కూడా పాజిటివ్ టైటిల్స్ కి కొదవ లేదు. అలా వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద హిట్ అయ్యాయి.

కావున వెంకటేష్ – క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో కూడా ఫుల్ పాజిటివ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార ముచ్చటగా మూడోసారి వెంకటేష్ సరసన జోడీ కట్టనుంది. ఈ సినిమాకి మలయాళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ మ్యూజిక్ అందించనున్నాడు. ఆగష్టు చివర్లో స్టార్ట్ చేసి డిసెంబర్లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్న ఈ సినిమాని డి. సురేష్ బాబు – పరుచూరి ప్రసాద్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు.

Exit mobile version