‘పుష్పక విమానం’ టాకీలా ‘సారంగపాణి జాతకం’ ఉంటుంది – వెన్నెల కిషోర్

ve

“కోర్ట్” చిత్రంతో కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న వెర్సటైల్ స్టార్ ప్రియదర్శి టైటిల్ రోల్ ప్లే చేసిన చిత్రం “సారంగపాణి జాతకం”. “జెంటిల్ మ్యాన్, సమ్మోహనం” చిత్రాల అనంతరం ఇంద్రగంటి మోహనకృష్ణ – శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ శరేవేగంగా సాగుతున్న నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్ రూపా కొడవాయూర్, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా 25 తేదీన రిలీజ్ అవుతున్నది. జెంటిల్మన్, సమ్మోహనం తర్వాత మోహన్ కృష్ణతో మరోసారి సినిమా చేశాను. ఈ సినిమా అవుట్ పుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమా హిట్ కావడం గ్యారెంటీ. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, అవసరాల శ్రీనివాస్, వడ్లమాని శ్రీనివాస్, వీకే నరేష్ ఈ సినిమాకు అస్సెట్. ఓ మంచి ఫ్యామిలీ సినిమాను డెలివరీ చేస్తున్నాం’ అని అన్నారు.

హీరోయిన్ రూపా మాట్లాడుతూ.. ‘సారంగపాణి జాతకం గురించి చెప్పాలంటే.. నేను స్వతహాగా జాతకాలు నమ్మను. కానీ ఈ సినిమా చేసిన తర్వాత జాతకాలను నమ్మడం మొదలుపెట్టాను. విజయవాడలో డాక్టర్‌గా పనిచేసుకొందామంటే.. నన్ను యాక్టర్ చేశారు. సారంగపాణి జీవితంలో ట్విస్టులు ఈ సినిమాలో వినోదాన్ని పండిస్తుంది. సారంగపాణి జాతకంతో ప్రియదర్శి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. దర్శకుడు ఇంద్రగంటి బంగారం లాంటి వారు. తెలుగు భాష పట్ల ఎంత ప్రేమ ఉంటుందో చెప్పలేం. ఆయన సినిమాలో నటించడం గర్వంగా భావిస్తున్నాం.’ అని అన్నారు.

దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ మాట్లాడుతూ.. ‘సారంగపాణి జాతకం సినిమా కామెడీ, క్రైమ్ చిత్రం. క్రైమ్ అంశంతో కామెడీ సినిమాను అందించాం. నిర్మాత కృష్ణ ప్రసాద్ ఎంతో ప్రోత్సాహం అందించారు. నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన చిత్రం. మీడియా వల్ల నా సినిమాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఈ సినిమాను కూడా మీడియా వీలైనంత మేరకు ప్రేక్షకులకు చేరువయ్యేలా ప్రమోట్ చేయాలని కోరుకొంటున్నాను. కేవలం తెలుగు నటీనటులు నటించిన అచ్చ తెలుగు సినిమా సారంగపాణి జాతకం. మిమ్మల్ని అన్ని రకాలుగా మెప్పిస్తుంది’ అని అన్నారు.

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఇంద్రగంటి గారితో పనిచేయాలనే కోరిక నెరవేరింది. ఈ టీమ్‌తో మరోసారి వర్క్ చేయాలనే కోరిక కలిగింది. మంచి టీమ్‌తో ఈ సినిమా రూపొందింది. మండు వేసవిలో చల్లని ప్రశాంతమైన వాతావరణం కలిగితే ఎంత ఆనందం ఉంటుందో.. ఈ సినిమా కూడా అలాంటి అనుభూతిని కలిగిస్తుంది. వినోదంతో కూడిన మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తప్పకుండా థియేటర్‌లో చూడండి. 25వ తేదీన మిమ్మల్ని నేను థియేటర్‌లో కలుస్తాను. నేను ఎప్పుడూ మంచి సినిమా అందించేందుకు ప్రయత్నిస్తున్నాను’ అని అన్నారు.

వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. ‘ ‘పుష్పక విమానం‘ టాకీగా వస్తే ఎలా ఉంటుందో, ఈ ‘సారంగపాణి జాతకం‘ అలా ఉంటుంది. నిర్మాత కృష్ణ ప్రసాద్ గారు గుడ్ కాప్. దర్శి ‘కోర్టు’ విజయం తర్వాత డాషింగ్‌గా కనిపిస్తున్నారు. హీరోయిన్ రూపా మంచి టాలెంటెడ్ నటి. ఈ సినిమా పూర్తి వినోద భరిత చిత్రం. ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. కాబట్టి థియేటర్‌లో చూడండి’ అని అన్నారు.

Exit mobile version