
వెన్నెల కిషోర్ వంటి టాలెంటెడ్ కమెడియన్ ఇండస్ట్రీలో పలు సంవత్సరాలుగా నవ్విస్తున్నాడు. కామెడీని పలికించడంలో, పంచ్ డైలాగుల విషయంలో వెన్నెల కిషోర్ ది భిన్నమైన శైలి. ఈ యువ కమెడియన్ తాజా చిత్రం ‘అలా ఎలా?’ సినిమా నిన్న విడుదలైంది. ఈ సినిమాలో కిషోర్ నటన అందరినీ ఆకట్టుకుంది
భార్యా బాధితుడిగా వెన్నెల కిషోర్ పండించిన కామెడీ సూపర్ హిట్ అయ్యింది. రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మల్టీప్లెక్స్ వర్గాల ప్రశంసలు పొందుతుంది. అన్నీష్ కృష్ణ దర్శకుడు