ప్రస్తుతం టాలీవుడ్ ఫేమస్ కమెడియన్స్ లో ఒకరుగా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తున్న కమెడియన్ వెన్నెల కిషోర్. 2005 లో ‘వెన్నెల’ సినిమాతో కమెడియన్ గా పరిచయమైన వెన్నెల కిషోర్ ఇప్పుడు దాదాపు అందరి స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా కనిపిస్తున్నాడు. తన ఇన్నేళ్ళ కెరీర్ లో తను కన్న కల ఇప్పుడే నెరవేరబోతోంది.
ఆ కల ఏంటా అనుకుంటున్నారా.? అదేమిటంటే వెన్నెల కిషోర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. కానీ ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వెన్నెల కిషోర్ కి రాలేదు. కానీ తాజాగా అతని కల నెరవేరింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కలిసి నటిస్తున్న ‘గోపాల గోపాల’ సినిమాలో వెన్నెల కిషోర్ కి అవకాశం వచ్చింది. ఈ సినిమాలో కిషోర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
వెంకటేష్ సరసన శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని(డాలీ) డైరెక్టర్. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
