‘సేవ్ టైగర్’ అంటున్న ప్రకాష్ రాజ్

prakash-raj
భాషతో సంబంధం లేకుండా ఇటు సౌత్, అట్టు నార్త్ సినిమాల్లో ఎన్నో విలక్షణ పాత్రలు చేసి సినీ అభిమానులను మెప్పించిన నటుడు ప్రకాష్ రాజ్. ఈ మధ్యకాలంలో స్టార్ ఇమేజ్ ఉన్న సెలబ్రిటీస్ ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. అలాంటి స్టార్స్ లిస్టులో ప్రకాష్ రాజ్ కుడా చేరాడు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కర్ణాటకలోని బందిపూర్ విలేజ్ లో సంచరిస్తూ అక్కడి స్కూల్ పిల్లలకి, ఆ గ్రామ ప్రజలకి మన జాతీయ మృగం అయిన పులిని కాపాడుకోవడం మన బాధ్యతనే విషయం పై అవగాహన కల్పిస్తున్నారు.

ప్రకాష్ రాజ్ ‘సేవ్ టైగర్’ అనే కాన్సెప్ట్ తో నేషనల్ లెవల్ ప్రచార కర్తగా వ్యవహరిస్తూ టైగర్ ని సేవ్ చెయ్యడం ఎంత అవసరం అనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఆయన కర్ణాటకలోని నాగర్ హోల్ ఫారెస్ట్ లో తిరుగుతూ అక్కడి ప్రజలకి టైగర్ ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నాం. ఈ కాంపైన్ పూర్తయిన తర్వాత ప్రకాష్ రాజ్ కమల్ హాసన్ చీకటి రాజ్యం షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.

Exit mobile version