సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణంలో, దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘విచిత్ర’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సిస్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సన్నద్ధమైంది. రవి, శ్రేయ తివారి ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటించారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ, ‘విచిత్ర’ పూర్తిగా అమ్మ సెంటిమెంట్ నేపథ్యంతో రూపొందిన కథ అని తెలిపారు. తల్లి ప్రేమ, త్యాగం, కుటుంబ బంధాలను హృదయాన్ని తాకే విధంగా చూపించామని ఆయన పేర్కొన్నారు. ప్రతి కుటుంబం తమ తల్లి గురించి ఆలోచించేలా ఈ సినిమా ఉంటుందని, ఇది కేవలం హారర్ థ్రిల్లరే కాకుండా, అందరూ కలిసి చూసి ఆనందించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని మాలిక్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందులో జ్యోతి అపూర్వ, ‘బేబీ’ శ్రీ హర్షిణి యసిక, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతి శేఖర్, మీనా వాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం త్వరలో విడుదలై ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్ర వేస్తుందనే ఆశాభావం మాలిక్ వ్యక్తం చేశారు.
