పిక్ టాక్ : కత్రినా బర్త్ డే.. హగ్ ఇస్తూ బెస్ట్ విషెస్ చెప్పిన భర్త విక్కీ కౌశల్

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె భర్త, నటుడు విక్కీ కౌశల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక అందమైన ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలో, వీరిద్దరూ ఇంట్లోనే చాలా నిరాడంబరంగా, ఆత్మీయంగా బర్త్‌డే వేడుకలను జరుపుకున్నారు.

బ్యాక్‌గ్రౌండ్‌లో “హ్యాపీ బర్త్‌డే కత్రినా” అనే బ్యానర్ కనిపించగా.. కత్రినాను విక్కీ ప్రేమగా హగ్ చేసుకుని, ఒక చేత్తో కేక్ పట్టుకుని ఉన్న క్యూట్ మూమెంట్‌ను ఈ పిక్చర్‌లో చూడవచ్చు. వైట్ టాప్, డెనిమ్ జాకెట్ ధరించి సాధారణ లుక్‌లో ఉన్న కత్రినా.. భర్త కౌగిలిలో ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపించింది. ఈ అందమైన చిత్రానికి విక్కీ కౌశల్ హిందీలో “జాన్ కా జన్మదిన్” అంటూ తన ప్రేమను కురిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కత్రినాకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Exit mobile version