రజనీ సరసన హీరోయిన్‌గా విద్యా బాలన్?

rajnikanth-vidhya

‘కొచ్చాడయాన్’ (విక్రమ సింహ), ‘లింగా’ లాంటి రెండు వరుస ఫ్లాపుల తర్వాత కొత్తతరం దర్శకులైతే తనను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారన్న ఆలోచనలో ఉన్న రజనీ, ‘అట్టకత్తి’, ‘మద్రాస్’ సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు రంజిత్‌ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించిన విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి థాను ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఆగష్టు ఒకటిన ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ విద్యా బాలన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర లేదనే ప్రచారం జరిగినా అందులో నిజం లేదని సమాచారం. ఇక రజనీ కాంత్ దీపికా పదుకొనే, సోనాక్షి సిన్హా ఇలా వరుసగా బాలీవుడ్ భామలతో జత కట్టడం విశేషంగా కనిపిస్తోంది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో రజనీ తన వయసుకు సరిపోయే తరహా పాత్రను చేయనున్నట్లు తెలుస్తోంది. ఓ వయసైన గ్యాంగ్‌స్టర్‌గా రజనీ ఈ సినిమాలో కనిపించనున్నారట.

Exit mobile version