‘విజిల్’ సినిమాతో విజయ్ కోరిక నెరవేరింది

whistle

విజయ్ తమిళనాట ఎంత పెద్ద స్టార్ హీరోనో అందరికీ తెలుసు. అలాంటి హీరోకు నిన్న మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో సరైన మార్కెట్ లేదు.

రజనీకాంత్, సూర్య, కార్తీ, విశాల్ లాంటి హీరోలంతా తెలుగు రాష్ట్రాల్లో ఒక స్థాయి మార్కెట్ ను ఛాన్నాళ్ల క్రితమే క్రియేట్ చేసుకున్నా ఆ ఫీట్ విజ‌య్‌కు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. 2017లో వచ్చిన ‘అదిరింది’తో పర్వాలేదనిపించినా ఆ తర్వాత రిలీజైన ‘సర్కార్’ మెప్పించలేకపోవడంతో ఆ అరకొర మార్కెట్ కూడా డ్యామేజ్ అయింది. అది విజ‌య్‌ను మరింత నిరుత్సాహానికి గురిచేసింది.

కానీ తాజా చిత్రం ‘విజిల్’తో దళపతికి తెలుగునాట మార్కెట్ క్రియేట్ అయింది. పాజిటివ్ క్రేజ్ నడుమ విడుదలైన ఈ సినిమాకు థియేటర్లు ఎక్కువ సంఖ్యలో దొరకడంతో తొలిరోజు ఓపెనింగ్స్ దక్కాయి. వర్డ్ ఆఫ్ మౌత్ బాగుండటంతో 2వ రోజు వసూళ్లు మొదటిరోజు కంటే ఎక్కువగానే ఉన్నాయి. తెలుగు పంపిణీదారుల సమాచారం మేరకు 2రోజులకు కలిపి చిత్రం రూ.7 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తోంది.

ఇక ఈరోజు ఆదివారం కావడంతో ఈ వసూళ్లు మరింత మెరుగ్గా ఉండనున్నాయి. మొత్తానికి ఈ చిత్రంతో విజయ్ కోరిక నెరవెరినట్టైంది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత మహేష్ కోనేరు డిస్ట్రిబ్యూట్ చేశారు.

Exit mobile version