ఎందరికో చేయూతనిచ్చిన రౌడీ హీరో.!

Vijay Deverakonda
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు కేవలం హీరో గానే కాకుండా వ్యక్తిగా కూడా ఓ మెట్టు పైకి ఎక్కిన వాడయ్యాడు. గత కొన్ని రోజుల కితమే తాను తన టీం తో కలసి ప్రతిభావంతులైన యువతకు చేయూత అందిస్తున్నామని తెలిపారు.

అలాగే ఆ తర్వాత కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మరియు విశాఖలో ఎల్ జి పాలిమర్స్ ఘటన జరిగినపుడు వెంటనే స్పందించి సాయం అందించాడు. అంతే కాకుండా అలా నిస్సహాయతలో ఉన్నవారికి ఫండ్ కూడా కల్లెక్ట్ చెయ్యడం మొదలు పెట్టాడు.

అలా మొదలు పెట్టిన ఫండింగ్ ఇప్పుడు బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఫండింగ్ ద్వారా ఇప్పటి వరకు విజయ్ 1.7 కోట్లు కలెక్ట్ చెయ్యగా ఆ మొత్తం అంతటి ద్వారా 17 వేల 723 మధ్య తరగతి కుటుంబాలు సాయం అందుకున్నట్టు తెలుస్తుంది. విజయ్ తీసుకున్న ఈ స్టెప్ అతన్ని మరో లెవెల్ లో నిలిపింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Exit mobile version