బాక్సింగ్ కోచ్ తో విజయ్ దేవరకొండ ?


డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన సక్సెస్ కిక్ తో ప్రస్తుతం క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమా చేస్తోన్నాడు. కాగా తాజాగా ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం బాక్సింగ్ కోచ్ సారధ్యంలో విజయ్ దేవరకొండ బాక్సింగ్ సీన్స్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. బాక్సింగ్ సెటప్ కి సంబధించిన సెట్ పూర్తీ చేశారట. వచ్చే వారం నుండి ఈ సెట్ పై విజయ్ దేవరకొండ పై కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతున్నారని తెలుస్తోంది.

కాగా ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

Exit mobile version