మణిరత్నం, సాయి పల్లవి, విజయ్ ల స్పెషల్ ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ కి టైం ఫిక్స్!

Vijay-Sethupathi,-Sai-Palla

ప్రస్తుతం మన దక్షిణాది సినిమా నుంచి రాబోతున్న పలు ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లలో లెజెండరీ దర్శకుడు మణిరత్నం అలాగే విలక్షణ నటుడు విజయ్ సేతుపతి అలానే టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి కాంబినేషన్లో చేస్తున్న లవ్ స్టోరీ కూడా ఒకటి. ఇటీవల వచ్చిన చిన్న పాటి ఆడియో గ్లింప్స్ తో ఫ్యాన్స్ లో మంచి ఉత్సుకత ఏర్పడింది.

అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన టైటిల్ టీజర్ ని రేపు సెప్టెంబర్ 7న సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్టు ఖరారు చేసారు. సో ఈ స్పెషల్ ప్రాజెక్ట్ పై మరింత క్లారిటీ రేపు వస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. దాదాపు ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల కానుంది.

Exit mobile version