కోలీవుడ్ లో ఎలాంటి రికార్డులకైనా పెట్టింది పేరు ఇళయ థలపతి విజయ్. ఒక్క బాక్సాఫీస్ దగ్గరే కాకుండా స్మాల్ స్క్రీన్, సోషల్ మీడియాలలో కూడా విజయ్ కు భారీ రికార్డులే ఉన్నాయి. అలా తాను నటించిన లేటెస్ట్ చిత్రం “మాస్టర్” టీజర్ తో సెన్సేషనల్ రికార్డులను సెట్ చేశారు.
స్టార్టింగ్ లోనే వ్యూస్ మరియు లైక్స్ పరంగా మన ఇండియాలోనే భారీ రికార్డులు సెట్ చేసిన ఈ టీజర్ ఇప్పుడు మరో ఇండియన్ రికార్డును నెలకొల్పినట్టు తెలుస్తుంది. ఈ టీజర్ కు ఏకంగా 5 లక్షలకు పైగా కామెంట్స్ రావడంతో ఈ టీజర్ మోస్ట్ కామెంటెడ్ ఇండియన్ టీజర్ గా నిలిచింది.
ఈ దీనితో విజయ్ ఖాతాలో మరో రికార్డు పడ్డట్టు అయ్యింది. ఇక ఈ చిత్రాన్ని లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వం వహించగా అనిరుధ్ సంగీతం అందించారు. అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్ట్రాంగ్ విలన్ రోల్ లో నటించగా మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించింది. మరి భారీ అంచనాలను సెట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.
