‘స్లమ్ డాగ్’ గా మారిన విజయ్ సేతుపతి.. పూరీ సినిమా కోసం కొత్త మేకోవర్ రిలీజ్!

Slum-Dog

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో సినిమా అనౌన్స్ అయినపుడు ఆడియెన్స్ మంచి ఎగ్జైట్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంకా టైటిల్ కోసం కూడా చాలా సస్పెన్స్ నడిచింది. అయితే ఫైనల్ గా ఈ ట్రీట్ అప్డేట్ ని మేకర్స్ నేడు కనుమ, విజయ్ సేతుపతి పుట్టినరోజు కానుకగా ఇచ్చేసారు.

ఈ సినిమాకి “స్లమ్ డాగ్” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని లాక్ చేయగా విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ కూడా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఒక అంధుని పాత్రలో తను కనిపిస్తుండగా చేతిలో కత్తితో కూడా తాను కనిపిస్తున్నాడు. ఇలా ఓ ఇంట్రెస్టింగ్ టేక్ తో సినిమా రాబోతుంది అని చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమాకి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే పూరి జగన్నాథ్, ఛార్మీలు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version