విజయ్ దేవరకొండ ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. తన యాటిట్యూడ్, నటనతో ఆనతి కాలంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న ఈ యువ హీరో ప్రతి అంశం మీద భిన్నంగానే ఆలోచిస్తుంటారు. ఒక అంశాన్ని జనం ఏ కోణం నుండి ఆలోచిస్తారనేది ముందుగానే అంచనా వేసి దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతుంటారు. అదే ఆయనకు ప్రత్యేకతను ఆపాదించింది. నిన్న జరిగిన దిల్ రాజు పుట్టినరోజు వేడుకల గురించి కూడ తనదైన శైలిలో కామెంట్ చేశారు విజయ్.
దిల్ రాజు తన 50వ పుట్టినరోజు వేడుకలకు ఇండస్ట్రీలోని పెద్దలందరినీ పిలిచి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈమధ్య కాలంలో పరిశ్రమలో ఇంత పెద్ద పార్టీ జరగలేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, నాగ చైతన్య, రామ్, విజయ్ దేవరకొండ ఇలా స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, ఇతర నిర్మాతలు వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రభాస్, మహేష్, చరణ్, నాగ చైతన్య, రామ్, విజయ్ కలిసి దిల్ రాజుతో ఒకే ఫ్రెమ్లో కనిపించారు. దాన్ని ట్వీట్ చేసిన విజయ్ ది బిగ్ బాయ్స్ అండ్ ది కిడ్ అంటూ కామెంట్ చేశారు. ఇలా స్టార్ హీరోల పక్కన తనను తాను పిల్లాడిగా అభివర్ణిస్తూ విజయ్ వారిని గౌరవించిన విధానాన్ని మెచ్చుకోవాల్సిందే కదా.
The Big Boys and the kid!
Last night 🙂 pic.twitter.com/mrabRRgSg9— Vijay Deverakonda (@TheDeverakonda) December 18, 2020
