తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా ఇప్పుడు దర్శకుడు వెంకట్ ప్రభుతో చేస్తున్న భారీ చిత్రం “గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి వచ్చిన టైటిల్ సహా ఫస్ట్ లుక్ పోస్టర్ లు మంచి ఆసక్తిని రేపాయి. కానీ ఈ చిత్రం పోస్టర్స్ తర్వాత పలు రూమర్స్ ఈ సినిమా విషయంలో మొదలయ్యాయి.
ఈ పోస్టర్స్ లో ఇద్దరు విజయ్ లు ఒకరు యంగ్ లుక్ లో ఒకరు ఓల్డ్ లుక్ లో కనిపిస్తుండడంతో చాలా మంది ఇద్దరు తండ్రి కొడుకులు కావచ్చని అనుకుంటున్నారు. కానీ ఇంకో పక్క ఈ సినిమా ఓ హాలీవుడ్ సినిమాకి ఫ్రీమేక్ అంటూ టాక్ వైరల్ గా మారింది. హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “జెమినీ మ్యాన్” ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది అని రూమర్స్ మొదలయ్యాయి.
గత కరోనా సమయంలో నేరుగా ఓటిటి లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ అప్పుడు అందుకుంది. కానీ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి ఇపుడు ఇదే కాన్సెప్ట్ లో ఈ సినిమా విజయ్ సినిమా కూడా ఉంటుంది అని రూమర్స్ మొదలయ్యాయి. మరి దీనిపై రానున్న రోజుల్లో ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
