విక్రమ్ తొమ్మిదేళ్ల డిలే ప్రాజెక్ట్ ‘దృవ నక్షత్రం’కి కొత్త డేట్?

కోలీవుడ్ స్టార్ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ సినిమానే దృవ నక్షత్రం. టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ మీనన్ తో చేసిన ఈ సినిమా అనేక వాయిదాలు పడుతూ వచ్చింది. ఎప్పుడో 2017 లోనే మొదలైన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో విడుదలకి నోచుకోలేదు. ఇంత జరిగినప్పటికీ గౌతమ్ మీనన్ మాత్రం థియేటర్స్ లోనే ఈ సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యి ఉన్నారు.

అయితే ఈ సినిమాకి ఉన్న ఆర్ధిక ఇబ్బందులు, లీగల్ వ్యవహారాలు రీత్యా ఫైనల్ గా ఈ మే 27కి థియేటర్స్ లో వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లోపు న్యాయస్థానంలో సినిమాకి సంబంధించిన హియరింగ్ లు తుది తీర్పు వచ్చే అవకాశం ఉందట. సో ఈ తొమ్మిదేళ్ల ఆలస్యం చిత్రం ఫైనల్ గా అప్పటికి రావచ్చు. ఇక ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు ఫీమేల్ లీడ్ లో నటించగా హరీష్ జై రాజ్ సంగీతం అందించారు.

Exit mobile version