సంక్రాంతి కానుకగా విక్రమ్ – సమంతల సినిమా.?

samantha_vikram
ప్రస్తుతం తెలుగు తమిళంలో బిజీగా ఉన్న బ్యూటిఫుల్ సమంత విక్రమ్ సరసన నటించనున్న తమిళ్ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఓకే రోడ్ జర్నీ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందని సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఎఆర్ మురుగదాస్ – ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వాళ్ళు కలిసి నిర్మించనున్నారు.

ఈ చిత్ర ప్రొడక్షన్ టీం బాలీవుడ్, హాలీవుడ్ నటుల్ని కూడా ఇందులో తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. సిక్కిం, లడఖ్ లాంటి ప్రదేశాల్లో షూట్ చేయనున్న ఈ సినిమాని 2015 సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Exit mobile version