విలక్షణ దర్శకుడిగా గౌతమ్ మీనన్ మంచి పేరుంది. టాలెంటెడ్ హీరో చియాన్ విక్రమ్ తో చేస్తున్న చిత్రం ధ్రువ నక్షత్రం. ఈ చిత్ర షూటింగ్ మొదలై చానళ్ళు అవుతున్నా ఎందుకో వాయిదాపడుతూ వచ్చింది. జాన్ అనే స్పై ఏజెంట్ గా విక్రమ్ నటిస్తుండగా, స్పై థ్రిల్లర్ గా ఈ చిత్రన్ని దర్శకుడు గౌతమ్ తెరకెక్కిస్తున్నాడు. కాగా చిత్రీకణ పూర్తి చేసుకున్న ధ్రువ నక్షత్రం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుందట. దాదాపు 60రోజులు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకోనుందని, త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీ ప్రకటిస్తామని ఆయన ట్వీట్ చేశారు.
ఇక విక్రమ్ నటించిన తాజా చిత్రం మిస్టర్ కె కె నిరాశపరిచింది. అలాగే ఎప్పుడో 2005లో వచ్చిన అపరిచితుడు చిత్రం తరువాత విక్రమ్ ఆస్థాయి విజయం అందుకున్నదే లేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం ‘ఐ’ కూడా చెప్పుకొదగ్గ విజయం సాధించలేకపోయింది. కాగా విక్రమ్ మణిరత్నం తెరకెక్కించనున్న పొన్నియన్ సెల్వన్ అనే భారీ పీరియాడిక్ మూవీలో హీరోగా నటించనున్నారు. ఐశ్వర్య రాయ్, కార్తీ,జయం రవి, కీర్తి సురేష్ వంటి స్టార్ క్యాస్ట్ ఈ చిత్రంలో నటించడం విశేషం.
And The Season doesn’t end without this film that’s really close to my heart & is hopefully state of the art. Tremendous& positive experience working with THE Chiyaan Vikram!
#DN in post production over the next 60 days and heading towards release. #Johnwillmeetyousoon pic.twitter.com/tVF6IMKw11— Gauthamvasudevmenon (@menongautham) November 2, 2019
