హిందీ వెర్షన్ ‘ఐ’ కి డబ్బింగ్ చెబుతున్న విక్రమ్

vikram
ఓ మెసేజ్ ని కమర్షియల్ గా చెప్పడంలో సక్సెస్ అయిన డైరెక్టర్ శంకర్ తన్న కెరీర్లో మొదటిసారి ట్రై చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ’. సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ‘ఐ’ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఐ సినిమాని ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం హీరో విక్రమ్ ముంబైలో ఈ సినిమా హిందీ వెర్షన్ కి డబ్బింగ్ చెబుతున్నాడు. తను చేసిన మూడు డిఫరెంట్ పాత్రలకి పర్ఫెక్ట్ గా సరిపోయేలా చాలా జాగ్రత్తలు తీసుకొని సొంత డబ్బింగ్ చెబుతున్నాడు. మరోవైపు ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ కూడా రీ రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

విజువల్స్ పరంగా ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళేలా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించాడు.

Exit mobile version