
‘ నేను గతంలో ఇతర సినిమాలలో సన్నివేశాలు, పుస్తకాలలో సన్నివేశాలు కాపీ కొట్టాను. కాని ‘విక్రమార్కుడు’ సినిమాలో బుల్లెట్స్ సన్నివేశం మాత్రం కాపీ కాదు. మా నాన్నగారు( రచయిత విజయేంద్ర ప్రసాద్) చాలా రోజుల క్రితమే రాశారు. ‘శాంభవి ఐపిఎస్’ సినిమాలో సన్నివేశం ఎలా ఉందొ నాకు తెలియదు. ఈ వివాదం గురించి ఇంతకు మించి వ్యాఖ్యానించదలుచుకోలేదు. నాకు అంత టైం లేదు. నమ్మేవాళ్ళు నమ్మండి. ‘ అంటూ సోషల్ మీడియాలో స్పందించారు దర్శకుడు రాజమౌళి.
విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ‘శాంభవి ఐపిఎస్’లో సన్నివేశం, రవితేజ ‘విక్రమార్కుడు’ సినిమాలో సన్నివేశాల మధ్య చాలా సారూప్యతలు, పోలికలు ఉండడంతో సోషల్ మీడియాలో కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. డైలాగులు కూడా ఒకేలా ఉండడంతో రాజమౌళి కాపీ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. వీటిపై వివరణ ఇవ్వక తప్పలేదు ‘విక్రమార్కుడు’ దర్శకుడికి. తెలుగులో ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా ముద్ర పడిన రాజమౌళికి ఈ వివాదం ఇబ్బంది కలిగించే అంశమే.
‘శాంభవి ఐపిఎస్’ సినిమాలో సన్నివేశం :
https://www.youtube.com/watch?v=S7iMDkNdcC8
‘విక్రమార్కుడు’ సినిమాలో బుల్లెట్స్ సన్నివేశం :