కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన దళపతి విజయ్ తన మొదటి ఎన్నికల పోటీ లోనే అఖండమైన సక్సెస్ సాధించి ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎవ్వరూ ఊహించని ఫలితాలని తాను అందుకొని తమిళనాట రాజకీయాల్లో చక్రం తిప్పిన విజయ్ కి నిన్న మే 4 ఉదయం మొదలైన కౌంటింగ్ నుంచే తమిళనాట మారుతున్న లెక్కలు చూసి అభిమానులు తమ ప్రేమను మరింత అందించారు.
విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ పలు విజువల్స్ కూడా వైరల్ గా మారాయి. అయితే లేటెస్ట్ గా విజయ్ కుటుంబంతో కలిసి తన విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్న స్పెషల్ వీడియోని విజయ్ టీం వదిలింది. దీనితో తన కుటుంబం అంతా విజయ్ భారీ విన్నింగ్ ని చూసి పట్టరాని ఆనందంతో ఇందులో కనిపిస్తున్నారు.
కానీ విజయ్ తన మార్క్ లోనే సైలెంట్ గా తన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో ఆ మధుర క్షణాన్ని ఆస్వాదించాడు. అలా వారి దగ్గర నుంచి బయటకి వచ్చి కేరింతలు కొడుతున్న అభిమానులకి అభివాదం చూపుతూ తన కార్ లో బయలుదేరిన విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
EXCLUSIVE: Thalapathy VIJAY celebrates his political debut success with his parents. pic.twitter.com/4QVNeqTPoA
— Actor Vijay Team (@ActorVijayTeam) May 5, 2026
