డైరెక్టర్‌గా మారిన హీరో.. అయినా వదలని ఫ్లాప్ సెంటిమెంట్..!

నటుడు విశాల్ దర్శకత్వ అరంగేట్రం చేసిన చిత్రం ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దర్శకుడు రవి అరసు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో విశాల్ స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించాడు. అయితే, ఒక దర్శకుడిగా మరియు హీరోగా ఈ సినిమా ఆయనకు తీవ్ర నిరాశనే మిగిల్చింది.

విడుదలైన మొదటి రోజు నుంచే విమర్శకులు, ప్రేక్షకులు ఈ సినిమాను పూర్తిగా తిరస్కరించారు. పాతకాలపు కథనం, రొటీన్ ట్రీట్మెంట్, మితిమీరిన క్లీషేలు ఈ సినిమాకు ప్రధాన మైనస్‌గా మారాయి. ఎలాంటి కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించలేకపోయారు.

నెగెటివ్ రివ్యూలు, పూర్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో థియేటర్లకు జనాలు కరువయ్యారు. వీకెండ్ కలెక్షన్లు రూ.2 కోట్ల మార్కును కూడా దాటకపోవడంతో, కనీసం ప్రింట్ అండ్ పబ్లిసిటీ ఖర్చులు కూడా రికవర్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

Exit mobile version