‘సిఫా’ ఎన్నికల్లో పోటీ చేయనున్న విశాల్!

vishal-Interview
తెలుగు, తమిళ భాషల్లో యాక్షన్, కుటుంబ కథా చిత్రాలతో అందరికీ దగ్గరైన హీరో విశాల్. ఇప్పటివరకూ కేవలం నటుడిగానే కొనసాగిన ఆయన కొన్ని సమయాల్లో తమ ప్రొడక్షన్ వ్యవహారాలను చూసుకునే బాధ్యతలను చేపట్టారు. తాజాగా విశాల్ మరో సరికొత్త పాత్ర కోసం సిద్ధమయ్యారు. తమిళంలో నటీనటుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసుకున్న ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేష్’ (నడిగర్ సంఘం) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి విశాల్ పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ విషయాన్ని విశాల్ స్వయంగా తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా కన్‌ఫర్మ్ చేశారు. “గతంలో కాలేజీ తరపున ఎన్నికల్లో నిలబడ్డా. మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో నిలబడుతున్నా. మంచి కోసమే పోరాడతా. ప్రస్తుతం ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యా. దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నా” అంటూ ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ అసోసియేషన్‌కు ప్రముఖ నటుడు శరత్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ పదవిలో ఆయన గత మూడు దఫాలుగా పనిచేస్తున్నారు.

Exit mobile version