వరుసగా ఛాలెంజింగ్ రోల్స్ ఎంచుకొని సత్తా చాటుతున్నాడు యంగ్ హీరో విశాల్. ఆయన నటించిన యాక్షన్ మూవీ థియేటర్ల లో సందడి చేస్తుంది. తమన్నా హీరోయిన్ గా సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో విశాల్ కల్నల్ శుభాష్ గా చేశారు. ప్రస్తుతం విశాల్ తుప్పరివాలన్2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. 2017లో వచ్చిన తుప్పరివాలన్ మూవీలో విశాల్ ప్రైవేట్ డిటెక్టివ్ గా కనిపించారు. కాగా ఈ మూవీకి సీక్వెల్ గా తుప్పరివాలన్2 తెరకెక్కుతుంది.
కాగా ఈ చిత్ర షూటింగ్ లండన్ లో జరుగుతుంది. కథలో భాగంగా లండన్లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించాల్సివుండగా చిత్ర యూనిట్ అక్కడ షూటింగ్ జరుపుతుంది. దర్శకుడు మిస్కిన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ స్వయంగా నిర్మిస్తున్నారు. మొదటి భాగంలో విశాల్ స్నేహితుడిగా చేసిన ప్రసన్న ఈ చిత్రంలో కూడా అదే రోల్ చేస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ఈ మూవీ విడుదల కానుంది . తెలుగులో ఈ చిత్రం డిటెక్టివ్ గా విడుదలైంది.
