
తమిళ నటుడు విశాల్ నటిస్తున్న పూజై చిత్ర షూటింగ్ లో అతను తీవ్ర గాయాల పాలయ్యాడు.మాస్ ఎంటర్టైనర్ గా దర్శకుడు హరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇటీవలే విశాల్, శృతి హసన్ మధ్య కొన్ని సన్నివేశాలను ఈ చిత్ర బృందం చిత్రీకరించింది. తాజాగా చెన్నై లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో విశాల్ కు ఈ ప్రమాదం జరిగింది. బ్రిడ్జి పై నుంచి దూకుతున్న సమయంలో కింద పార్క్ చేసి ఉన్న కారుపై విశాల్ పడ్డారని సమాచారం. కిందపడిన వెంటనే అతన్ని హాస్పిటల్ లో చేర్పించగా విశాల్ చేతికి 16 కుట్లు వేశారు.
కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు విశాల్ కు సలహా ఇచ్చారు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని ఈ చిత్ర బృందం భావిస్తోంది. అంతేకాకుండా తెలుగులో కూడా అనువదించనున్నారు.