విశాల్ ‘జయసూర్య’ ఆడియో, మూవీ రిలీజ్ డేట్

Vishal
స్వతాహాగా తెలుగువాడైన యంగ్ హీరో విశాల్ మొదట తమిళంలో నటుడిగా పేరు తెచ్చుకొని ఆ తర్వాత తెలుగులో కూడా మాస్ హీరో గా పేరు తెచ్చుకొని తనకంటూ ఓ సెపరేట్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. విశాల్ చేసే ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. విశాల్ సుశీంద్రన్ డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పాయుం పులి’. సాయిచంద్ర ఫిలిమ్స్ బ్యానర్ పై జి. నాగేశ్వర్ రెడ్డి – ఎస్. నరసింహా ప్రసాద్ లు ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. ఈ తమిళ మూవీ తెలుగు వెర్షన్ కి ‘జయసూర్య’ అనే టైటిల్ ని అనౌన్స్ చేసారు.

‘జయసూర్య’ సినిమాలో విశాల్ ఓ కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. విశాల్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియోని ఆగష్టు 22న రిలీజ్ చేసి, సినిమాని సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. డి. ఇమ్మాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి శశాంక్ వెన్నెలకంటి తెలుగు వెర్షన్ కి డైలాగ్స్ రాస్తున్నాడు. విశాల్ – సుశీంద్రన్ కాంబినేషన్ లో వచ్చిన ‘పల్నాడు’, ‘ఇంద్రుడు’ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దాంతో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ఈ చిత్ర నిర్మాతలు ఆశిస్తున్నారు.

Exit mobile version