‘ఎర్రబస్సు’లో నటించడానికి గల రహస్యం తెలిపిన విష్ణు.

Manchu-Vishnu

‘ఎర్రబస్సు’లో విష్ణు నటనకు మంచి ప్రసంశలు లభిస్తున్నాయి. అతను చేసిన కామియో పాత్రకు అద్భుత స్పందన లభిస్తుంది. అతని స్టార్ ఇమేజ్ ను పక్కన పెట్టి.. విష్ణు ఈ సినిమాలో ఒక ఎమోషనల్ క్యారెక్టర్ లో నటించాడు. ఈ సినిమాలో నటించడం వెనుక అసలు రహస్యాన్ని విష్ణు వెల్లడించాడు.

దాసరి నారాయణరావు గారిపై ఉన్న గౌరవంతో, అభిమానంతో ‘ఎర్రబస్సు’ సినిమాలో విష్ణు నటించాడు. తన తండ్రి మోహన్ బాబుని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకరత్నపై ఈ విధంగా కృతజ్ఞత తెలియజేశానని విష్ణు తెలిపారు. ఈ సినిమాలో నటించినందుకు విష్ణు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.

మూడు నెలలో అమెరికా వెళ్లాలనుకునే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మరియు అతని తాతయ్య కథే ఈ ‘ఎర్రబస్సు’. మంచు విష్ణుని దాసరి చాలా స్టైలిష్ & హ్యాండ్ సం లుక్ లో ప్రజెంట్ చేశారు. విష్ణు సరసన కేథరిన్‌ త్రేసా నటించిన ఈ సినిమాకు చక్రి సంగీతం అందించారు. దాసరి దర్శకనిర్మాత.

Exit mobile version