
యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో టాలీవుడ్ లో సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. కానీ ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు చేయాలనుకునే మంచు విష్ణు ఇదే జానర్ లో చేసిన సినిమా ‘డైనమైట్’. పవర్ ప్యాక్ యాక్షన్ సీక్వెన్స్ లతో కంప్లీట్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అంతే కాకుండా చాలా చోట్ల సెప్టెంబర్ 3వ తేదీనే ఈ సినిమా ప్రీమియర్స్ కూడా పడనున్నాయి. బాగా ఇంటెన్స్ ఉన్న సినిమాలు తీసిన దేవా కట్టా దర్శకత్వం వహించింది.
గత వారం రోజుల నుంచి ఇరు రాష్ట్రాల్లో ప్రీ ప్రమోషనల్ టూర్ నిర్వహించిన ఈ చిత్ర టీం ప్రస్తుతం హైదరాబాద్ లో పలు ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. మంచు విష్ణు డైనమైట్ సక్సెస్ పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అంతే కాకుండా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త దానాన్ని ఆదరిస్తారు, మేము చేసిన ఈ సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ ని కూడా ఆదరిస్తారన్న నమ్మకం నాకుందని మంచు విష్ణు తెలిపాడు. మంచు విష్ణు సరసన ప్రణిత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అచ్చు సంగీతం అందించాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ స్పెషల్ హైలైట్ కానున్నాయి.