
సినిమా సినిమాకి ఏ మాత్రం పొంతన లేకుండా వరుసగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్న యంగ్ హీరో మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘డైనమైట్’. ‘వెన్నెల’, ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ లాంటి విమర్శనాత్మక సినిమాలను డైరెక్ట్ చేసిన దేవకట్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు సరసన ప్రణిత హీరోయిన్ గా కనిపించనుంది. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసిన ఈ చిత్ర టీం ఈ సినిమా రిలీజ్ కోసం ఓ పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు. ముందుగా ముందుగా ఈ సినిమాని జూలైలో రిలీజ్ చేద్దాం అనుకున్నా సరైన రిలీజ్ టైం కాదని ఆగారు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం అక్టోబర్ 1న డైనమైట్ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్ణయించుకుంది. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ చిత్ర సాంగ్స్ మరియు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. డైనమైట్ లో మంచు విష్ణు ఫుల్ ఇంటెన్స్ పాత్రలో సూపర్బ్ యాక్షన్ సీక్వెన్స్ లతో అందరినీ ఆకట్టుకుంటాడని సమాచారం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా విక్రమ్ ప్రభు హీరోగా, ప్రియ ఆనంద్ హీరోయిన్ గా తమిళంలో ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి’కి రీమేక్. మంచు మోహన్ బాబు సమర్పణలో ప్రతిష్టాత్మకమైన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.