విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఫంకీ’. దర్శకుడు కెవి అనుదీప్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా ఫిబ్రవరి 13న గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాకి ఎలాంటి టాక్ వచ్చినా.. తన దృష్టిలో మాత్రం ఈ సినిమా ఒక విజయమేనని విశ్వక్ సేన్ ఒక మీడియా సంభాషణలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ చిత్రం, ప్రస్తుతం ఐదు భారతీయ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
కాగా, వివిధ భాషల్లో అందుబాటులో ఉన్నప్పటికీ, ఓటీటీ వేదికపై కూడా ఈ చిత్రం ఆశించిన స్పందనను రాబట్టలేకపోయింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను వీక్షించిన చాలామంది ప్రేక్షకులు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఓటీటీలో ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాలో అందాల భామ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు.
