విశ్వనాథ్ అండ్ సన్స్ : నాలుగు రోజుల్లోనే రూ.150 కోట్ల వసూళ్లు..!

తమిళ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం తొలి వీకెండ్‌లోనే అద్భుతమైన వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద మంచి జోరును ప్రదర్శించింది.

తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లోనే రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా పోస్టర్ విడుదల చేసింది. రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్, నాజర్, సునీల్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌కు తమిళం కంటే తెలుగు డబ్బింగ్ వెర్షన్ నుంచే ఎక్కువ ఆదాయం రావడం విశేషం. రాబోయే రోజుల్లో కూడా తెలుగు వెర్షనే కలెక్షన్లలో ముందంజలో ఉండే అవకాశం ఉంది. అయితే శుక్రవారం నుంచి ‘ఇరుముడి’ చిత్రం థియేటర్లలోకి రాబోతుండటంతో, ఆ పోటీని తట్టుకుని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Exit mobile version