సంజయ్ విశ్వనాథ్ ర్యాంపేజ్ షురూ.. మాస్ జంప్ తో సూర్య సినిమా!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కరుప్పు/వీర భద్రుడు తనకి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి ఈ ఏడాది భారీ వసూళ్లు అందించింది. ఇక ఈ చిత్రం తర్వాత తన నుంచి వచ్చిన మరో క్రేజీ ప్రాజెక్ట్ నే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి బజ్ నడుమ తమిళ్, తెలుగులో విడుదలకి వచ్చింది.

అయితే మేకర్స్ ముందు నుంచి చెబుతున్నట్టుగా మంచి టాక్ ని మొదటి షో నుంచే అందుకున్న ఈ సినిమా టాక్ బయటకి వచ్చిన తర్వాత సాలిడ్ బుకింగ్స్ తో ర్యాంపేజ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు గంటకి 21 వేలకి పైగా టికెట్ సేల్స్ బుక్ మై షో లో అమ్ముడు పోతున్నాయి. దీనితో సంజయ్ విశ్వనాథ్ ర్యాంపేజ్ మొదలైంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రం ఈరోజు మొత్తం సేల్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందించగా మమితా బైజు హీరోయిన్ గా నటించింది. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version