“విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్

Vishwanath & Sons

కోలీవుడ్ స్టార్ హీరో ది వన్ సూర్య హీరోగా మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ ఏడాది ఆల్రెడీ కరుప్పు/వీర భద్రుడు సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత క్లాస్ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందా అని చాలా డౌట్స్ పడ్డారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా మొదటి వారం దానికి మించి పెర్ఫామ్ చేసి అదరగొట్టింది.

ఇక లేటెస్ట్ గా ఈ సినిమా మరో భారీ మైల్ స్టోన్ అందుకున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా ఏకంగా 200 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో సౌత్ నుంచి సూర్య ఈ ఒక్క ఏడాదిలోనే తన సినిమాలతో 500 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి రేర్ ఫీట్ సెట్ చేశాడు. ఇక ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. అలాగే సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణం వహించారు.

Exit mobile version