తల అజిత్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘విశ్వాసం’ కు అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఈచిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా కెజెఆర్ స్టూడియోస్ విడుదలచేస్తుంది. అందుకుగాను ఈసినిమా హక్కులను 48కోట్లకు సొంతం చేసుకుంది. ఇక బెంగుళూరు లో 6కోట్లకు ,కేరళలో 3.5 కోట్లకు అలాగే రెస్ట్ అఫ్ ఇండియాలో 2కోట్లకు ఈచిత్రాన్ని అమ్మారు. ఇక ఓవర్సీస్ లో ఈచిత్రం 23 కోట్లు పలుకగా మొత్తం కలుపుకొని ఈచిత్రం 82.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. మరి ఈ మొత్తాన్ని రాబడితేనే ఈ చిత్రం సేఫ్ అవుతుంది. అజిత్ నటించిన గత చిత్రం ‘వివేగం’ బాక్సాఫిస్ వద్ద నిరాశపరిచిన ఆ ఎఫెక్ట్ ఈసినిమాపై పడలేదు.
ఇక తెలుగులో ఈ చిత్రం విడుదల వాయిదా పడడంతో ఈ చిత్రం యొక్క తెలుగు హక్కులు ఇంకా అమ్మలేదట. అజిత్ కు తెలుగులో ఏమంత పెద్ద మార్కెట్ కూడా లేదు మరి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదలచేస్తారో లేదో చూడాలి. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ కానుకగా జనవరి 10న విడుదలకానుంది. సత్యజ్యోతి ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
