విశ్వాసం ట్రైలర్ రెడీ !

Vishwaasam

తల అజిత్ నటించిన తాజా చిత్రం ‘విశ్వాసం’ యొక్క ట్రైలర్ విడుదలకు సిద్దమైంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ కు సౌండ్ మిక్సింగ్ చేస్తున్నారు చిత్ర సంగీత దర్శకుడు ఇమ్మాన్. ఈ ట్రైలర్ రేపు 1:30 నిముషాలకు ప్రేక్షకులముందుకు రానుంది. యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో అజిత్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు.

సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ కానుకగా జనవరి 10న విడుదలకానుంది. అయితే తెలుగులో ఈ చిత్రం విడుదలకావడం లేదని తెలుస్తుంది. అజిత్ , శివ కలయికలో వస్తున్న ఈ నాల్గవ చిత్రంపై తమిళ ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

ఇకఈచిత్రానికి బాక్సాఫిస్ వద్ద పెట్టా నుండి గట్టి పోటీ ఎదురుకానుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ చిత్రం కూడా అదే రోజున విడుదలవుతుంది. మరి ఈ రెండు చిత్రాల్లో కలెక్షన్ల పరంగా ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి.

Exit mobile version