
స్టైలిష్ స్టార్ కి బ్రేక్ ఇచ్చిన సినిమా ‘ఆర్య’. అలాగే సుకుమార్ కి డైరెక్టర్ గా తొలి హిట్ ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమా యిప్పటికీ యువతని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మే 7 2004 లో విడుదలైంది. ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తవడంతో ఈ చిత్ర టీం ఊటీలో సెలబ్రేట్ చేసుకున్నారు.
బన్ని స్పెషల్ గా సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్ తో కలిసి ఆర్య 10 ఇయర్స్ వేడుకలని సెలబ్రేట్ చేసుకున్నాడు. అదే సమయంలో వివి వినాయక్ కూడా వాళ్ళతో జాయిన్ అయ్యారు. ‘ఆర్య 10 సంవత్సరాలు పూర్తి చేసుకుందని ఊటీకి తెలిసింది. అదే సమయంలో నన్ను, సుకుమార్, బన్నిని కలిపి వివి వినాయక్ ఒక ఫోటో తీసాడని’ దేవీశ్రీ ప్రసాద్ ట్వీట్ చేసాడు.
ఇటీవలే రేసుగుర్రం సినిమాతో హిట్ అందుకున్న అల్లు అర్జున్ త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న సినిమాలో నటించనున్నాడు.