
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ చిత్రం నుండి ఇటీవల విడుదలైన ట్రైలర్ కోటి కి పైగా వ్యూస్ రాబట్టి అదిరిపోయే రెస్పాన్స్ ను రాబట్టింది. ఇక తాజాగా ఈ చిత్రంలో ని ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ లో హల్క్ లుక్ తో వున్నా రామ్ చరణ్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఆ పోస్టర్ ను చూస్తే బోయపాటి ఈ సీనిమాలో ఏ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించాడో అర్ధం చేసుకోవచ్చు.
అజర్ బైజాన్ లోని చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు మెగా అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నాయి. ఇక ఆ పోస్టర్ ను చిత్ర బృందం అధికారికంగా విడుదలచేసే అవకాశం వుంది.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కియరా అద్వానీ కథానాయికగా నటించగా స్నేహ ,ప్రశాంత్ , ఆర్యన్ రాజేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం జనవరి 11న విడుదలకానుంది.