
ఆది, క్రిస్టినా, ఎరికా ఫెర్నాండెజ్ నటినటులుగా నవీన్ గాంధీ దర్శకుడిగా సంపత్ నంది నిర్మించిన చిత్రం ‘గాలిపటం’. బోల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో సందర్భానుసారంగా లిప్ లాక్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. రొమాంటిక్ యూత్ ఫిల్మ్ గా ముద్రపడ్డ ఈ చిత్రానికి కుటుంబ ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తుండడంతో లిప్ లాక్ సన్నివేశాన్ని తొలగించామని దర్శకుడు నవీన్ గాంధీ తెలిపారు.
10, 20 ఏళ్ళ తర్వాత మన సమాజం ఎలా ఉంటుందో ‘గాలిపటం’ ద్వారా చూపించాం. చాలా బోల్డ్ అటెంప్ట్, క్లైమాక్స్ అడ్వాన్స్డ్ గా ఉందని చిత్ర పరిశ్రమ ప్రముఖులు, ప్రేక్షకులు అంటున్నారు. ఆ మాటలను ప్రసంశలా స్వీకరిస్తా. ప్రస్తుత యువత మనోభావాలను, వారి ఆలోచనలను తెరపై ఆవిష్కరించాం. అని నవీన్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆగస్ట్ 7న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది.