మహేష్ పేరును క్యాష్ చేసుకోవాలనుకోలేదు..!

super-star
ప్రస్తుతం ఒక్క తెలుగు సినీ అభిమానులే కాక అందరూ కొత్తదనం కోసం తపిస్తున్నారు. తెలుగు సినిమాల్లో ఈమధ్య కాలంలో సరికొత్త కథాంశాలతో వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించి ఆ కోవలో ఇతర దర్శకులను కూడా నడించేందుకు దారిని చూపాయి. తాజాగా ‘సూపర్ స్టార్ కిడ్నాప్’ పేరుతో ఓ సరికొత్త క్రైమ్ కామెడీ సినిమాతో వెండితెరకు పరిచయం కానున్నారు దర్శకుడు సుశాంత్. ఆదర్శ్ బాలకృష్ణ, భూపాల్, నందు మరియు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎప్పుడో పూర్తి కాగా చాలా కాలం పాటు విడుదలకు నోచుకోలేదు.

ఇక అన్ని ఇబ్బందులను దాటుకున్న ఈ సినిమా చివరకు జూలై 3న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై మంచి ఆసక్తి రేకెత్తించాయి. ఓ ముగ్గురు యువకులు సూపర్ స్టార్ మహేష్ బాబును కిడ్నాప్ చేయాలనుకునే నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని దర్శకుడు తెలిపారు. మహేష్ బాబు పేరును క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయలేదని, కథలో భాగంగా మహేష్ ఎలా ఈ సినిమాలోకి వచ్చారనేది ఆసక్తికర అంశమని ఆయన తెలిపారు. క్రేజీ ప్రమోషన్స్‌తో దూసుకెళుతోన్న ఈ సినిమాలో శ్రద్ధ దాస్ ఓ నెగటివ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.

Exit mobile version