
సుమంత్ అశ్విన్, నందిత జంటగా మారుతి సమర్పణలో దర్శకుడు హరినాథ్ తెరకెక్కించిన సినిమా ‘లవర్స్’. ఇటివల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ‘లక్కీ’తో దర్శకుడిగా పరిచయమైన హరినాథ్ ‘లవర్స్’తో విజయాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో సమావేశం అయ్యారు హరినాధ్. ‘లవర్స్’ విజయంతో పాటు తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు. హరినాథ్ చెప్పిన విశేషాలు మీ కోసం.
‘హిందీలో ఈ తరహా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఐడియా బేస్డ్ కథలతో రూపొందే చిన్న సినిమాలు మంచి విజయాలను నమోదు చేస్తున్నాయి. నేను కూడా చాలా రోజుల నుండి రొమాంటిక్ కామెడీ జోనర్లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాను. ‘లవర్స్’తో ఆ ఆశ నెరవేరింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మంచి సినిమా తీశావని అభినందిస్తున్నారు. దీనికి మారుతి గారు అందించిన ప్రోత్సాహం ముఖ్య కారణం. క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. ‘
‘ప్రేమ కథా చిత్రమ్’ సినిమాను మొదట హిందీలో తెరకేక్కించాలి అనుకున్నాను. కారణాలు ఏవైనా కుదరలేదు. అప్పుడు నేను రాసుకున్న ‘లవర్స్’ కథను మారుతీ గారికి నచ్చడం, తెలుగులో తెరకెక్కించడం జరిగాయి. ప్రస్తుతం ఈ సినిమాను హిందీకి తీసుకువెళ్తున్నాను. అక్కడ తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో మరో తెలుగు సినిమా కూడా ప్రారంభిస్తా. అని అన్నారు హరినాథ్.