తమిళ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న భారీ ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’. సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఈ సినిమా నుంచి తాజగా విడుదలైన ‘ది వెడ్డింగ్ సాంగ్’ పండుగ వాతావరణాన్ని తలపిస్తూ విపరీతంగా ఆకట్టుకుంటోంది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. విశేషమేమిటంటే, ఈ తెలుగు పాటని సూర్య స్వయంగా పాడి అభిమానులకి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.
పాటలో సూర్య, మమితా బైజుల కెమిస్ట్రీ, డ్యాన్స్ మూమెంట్స్ మరియు విజువల్స్ కళ్లకి విందులా ఉన్నాయి. ఎనర్జిటిక్ కొరియోగ్రఫీ, కుటంబ భావోద్వేగాలతో నిండిన ఈ వేడుక పాట రాబోయే పెళ్లిళ్ల సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
