మాస్ మహారాజా రవితేజ హీరోగా కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. డాన్ శీను, బలుపు వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతుంది. కాగా రవితేజ 66వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే దర్శకుడు గోపీచంద్ తాజాగా ట్వీట్ చేస్తూ.. ‘మల్టీ టాలెంటెడ్ నటి శ్రుతి హసన్ స్వాగతం..’ అని ట్వీట్ చేశాడు.
ఇప్పటికే గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని స్క్రిప్ట్ బాగా వచ్చిందట. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా ఈ సినిమా ఉంటుందట. ఇక ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నాడు. బి.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ లో సినిమాను గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు. అలాగే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
