లెనిన్ ఓకే… మరి ఆ తర్వాత పరిస్థితి..?

Akhil-Akkineni

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘లెనిన్’ సమ్మర్ కానుకగా రిలీజ్‌కు సిద్ధమైంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఫైనల్‌గా మే 1న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. అఖిల్ తన కెరీర్‌లో ఆశిస్తున్న మాస్ కమర్షియల్ సక్సెస్‌ను ఈ సినిమాతో అందిస్తాడని అక్కినేని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రం పక్కా యాక్షన్ మరియు లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. సినిమాలో అఖిల్ లుక్స్ మరియు భాగ్యశ్రీ బోర్సేతో ఆయన కెమిస్ట్రీ హైలైట్ కానున్నాయి. నిజానికి మొదట శ్రీలీల ఈ ప్రాజెక్ట్‌లో ఉండగా, ఆమె నిష్క్రమణతో భాగ్యశ్రీ ఈ క్రేజీ ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది.

‘ఏజెంట్’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అఖిల్, ఇకపై తన తదుపరి సినిమాల విషయంలో వేగం పెంచాలని భావిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిలిమ్స్ వంటి పెద్ద సంస్థలతో చర్చలు జరుగుతుండగా, ‘లెనిన్’ విజయంతో నేరుగా పాన్ ఇండియా మార్కెట్‌ను లక్ష్యం చేసుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. వివాహం తర్వాత కెరీర్‌పై మరింత ఫోకస్ పెట్టిన అఖిల్, ఈ సమ్మర్‌కు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

Exit mobile version