బాహుబలిలో ‘శివుడు’ అసలు పేరు ఏంటో తెలుసా.?

prabas-shivudu
సినిమా బడ్జెట్ సుమార్ 250కోట్లకి పైనే, షూటింగ్ కి పట్టిన సమయం రెండున్నరేళ్ళు, ఇక సినిమా రేంజ్ విషయానికి వస్తే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మొట్ట మొదటి బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్.. ఇవన్నీ దేని గురించి అంటే.. మరో నాలుగు రోజుల్లో మన ముందుకు రానున్న భారీ పీరియడ్ ఫిల్మ్ ‘బాహుబలి’. రెండు పార్ట్స్ గా రూపొందిన ఈ సినిమా మొదటి పార్ట్ జూలై 10న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ రెండున్నరేళ్ళుకి పైగా సమయాన్ని కేటాయించడమే కాకుండా, రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.

అవే బాహుబలి మరియు శివుడు అని అందరికి తెలుసు. కానీ శివుడు అసలు పేరు ఏంటి.? ఆ పాత్ర గురించి విషయాలను ప్రభాస్ తెలియజేశాడు. ‘ఈ సినిమాలో బాహుబలి, శివుడు పాత్రలు చేశా.. చెప్పాలంటే ఇద్దరూ బాహుబలిలే..ఒకరు అమరేంద్ర బాహుబలి అయితే మరొకరు మహేంద్ర బాహుబలి. అమరేంద్ర బాహుబలి ఫాదర్ అయితే మహేంద్ర బాహుబలి అలియాస్ శివుడు అతని కొడుకు. శివుడు చిన్నప్పటి నుండి ఆటవిక ప్రాంతంలో పెరుగుతాడు. ఆ పాత్రలో కాస్త అల్లరి ఉంటుంది, అలాగే చాలా స్ట్రాంగ్ కూడా. అడవిలో పెరిగిన శివుడు అసలు లక్ష్యం ఏంటనేది మీరు సినిమాలో చూసి తెలుసుకోవాలని’ ప్రభాస్ తెలిపాడు.

ప్రభాస్ కి గట్టి పోటీని ఇచ్చే విలన్ పాత్రలో రానా కనిపించనున్నాడు. సినిమాకి గ్లామర్ అట్రాక్షన్ అయిన హీరోయిన్స్ గా అనుష్క, తమన్నా కనిపించనున్నారు. వీరిద్దరూ కేవలం గ్లామర్ అట్రాక్షన్ గానే కాకుండా కత్తి యుద్దాలతో కూడా ప్రేక్షకులను మెప్పించనున్నారు.

Exit mobile version