విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. అసలు ఈ సినిమా పరిస్థితి ఏమిటి ?, బజ్ ఎలా ఉంది ?, సినిమాకి ఓపెనింగ్స్ ఎలా రాబోతున్నాయి ? అంటూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. మరోవైపు ఈ సినిమాకి మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం బజ్ మాత్రం అనుకున్న స్థాయిలో లేదనే చర్చ ఉంది. కానీ, అక్టోబర్ 9న విడుదల కానున్న ఈ సినిమాకు ఓపెనింగ్స్‌కు భారీగానే వచ్చేలా ఉన్నాయి. ఐతే, ఓపెనింగ్స్‌పై ఇప్పుడు ఖచ్చితమైన అంచనా వేయడం కంటే, ఇక నుంచి రాబోయే ట్రైలర్, పాటలు, రిలీజ్‌కు ముందు చేసే ప్రమోషన్స్ ఎలా ఉంటాయన్నదే కీలకంగా మారనుంది.
ఎలాగూ సినిమాలో వెంకటేష్ కామెడీ, పైగా ఫ్యామిలీ ఎమోషన్.. దీనికితోడు ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ ను కూడా మిక్స్ చేసారు. కాబట్టి, ఈ ఎలిమెంట్స్ అన్ని సినిమా ఓపెనింగ్స్‌కు ప్లస్ కావచ్చు. కాగా ఈ సినిమాలో నివేథా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్ మరియు బ్రహ్మాజీ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.
