మాస్ మహా రాజా రవితేజ – నక్కిన త్రినాధ్ రావ్ దర్శకత్వంలో ఒక కామెడీ ఎంటర్ టైనర్ ను చేస్తా అని కమిట్ అయ్యాడు. అయితే ఎప్పుడో స్క్రిప్ట్ పూర్తి చేసుకుని షూట్ కోసం ఎదురుచూస్తోన్న ఈ సినిమా, ఎప్పుడు మొదలవుతుందో ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. ఆ మధ్య షూటింగ్ స్టార్ట్ చేస్తామన్నారు. కానీ, రమేష్ వర్మ ఖిలాడీ సినిమా చేస్తున్న క్రమంలో రవితేజ, నక్కిన సినిమాని పోస్ట్ ఫోన్ చేశారు. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.
అయితే, వచ్చే నెల షూట్ కి ప్లాన్ చేస్తామంటున్నారు మేకర్స్. కానీ ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారని తెలుస్తోంది. ఇద్దరిలో రాశి ఖన్నాను ఆల్ రెడీ హీరోయిన్ గా ఫైనల్ చేశారట. కాగా రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చింది.
ఇక రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు. రవితేజ అలాంటి కామెడీ సినిమాతోనే ఈ సారి త్రినాథరావ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
