
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా సెట్స్ పైకి వెళ్ళాల్సింది. కానీ ఆ సినిమా ఇప్పటికీ ప్రారంభం కాలేదు అలాగే ఆ సినిమాపై ఎలాంటి క్లారిటీ
కూడా లేదు.
ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే సంవత్సరం ఉండవచ్చని, అది కూడా సుకుమార్ హీరోని, ప్రొడక్షన్ టీం ని కన్విన్స్ చేసేలా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో వస్తే ఈ సినిమా ఉండవచ్చని అంటున్నారు. ప్రస్తుతం సుకుమార్ ఇదే పనిలో ఉన్నాడు.
ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ‘రభస’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే పూరి జగన్నాధ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళతాడు.