తేజా సినిమా ఎప్పుడు ?

చిన్న చిత్రాలతో పెద్ద దర్శకుడు అనిపించుకున్న దర్శకుడు తేజ. రానాతో ‘నేనేరాజు నేనేమంత్రి’ లాంటి సూపర్ హిట్ సినిమా తీసాక్కూడా తేజాకి అంతతేలిగ్గా సినిమా పట్టాలెక్కేలా కనిపించట్లేదు. మొదట వెంకీతో సినిమా అన్నారు. నెలలు గడిచిపోయాయి. రూమర్స్ రావటం తప్పా అధికారికంగా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.

ఈ లోగా ఎన్టీఆర్ బయోపిక్ అవకాశం వచ్చింది. తేజాకి నిజంగా గొప్ప అవకాశమే అనుకున్నారు అందరూ. కానీ అంతలోనే దానినుండి తప్పుకున్నాడు. దాంతో మళ్లీ వెంకీ సినిమా ట్రాక్ లోకి వచ్చింది అన్నారు. మళ్లీ ఇంతలోనే వెంకీ కాదు, రానా అని లీకులు వచ్చాయి.

కానీ ఇప్పుడు చూస్తే రానా కంటి ఆపరేషన్ అని సినిమాలకి కొన్ని వారలు బ్రేక్ ఇచ్చాడు. అయినా ఇప్పటికే రానా చేతిలో ఆరు సినిమాలు పైగానే ఉన్నాయి. మరీ ఇవన్నీ చూస్తే ఇప్పట్లో రానా తేజాకి సినిమా చేసేలా కనిపించట్లేదు. మరీ తేజ సినిమా ఎప్పుడో !

Exit mobile version